ఆంటోని వర్గీస్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘కాటాలన్’ తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానున్నది. పాల్ జార్జ్ దర్శకుడు. షరీఫ్ అహమ్మద్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ముఖం, చేతులపై రక్తం కారుతుండగా, సిగార్ తాగుతూ ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్న ఆంటోని వర్గీస్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
థాయిలాండ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ కానున్నాయని, ప్రపంచప్రఖ్యాత ‘ఒంగ్-బాక్’ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫక్డీ ఈ యాక్షన్ సీన్స్‌కి కొరియోగ్రఫీ అందించారని మేకర్స్ తెలిపారు. సునీల్, కబీర్ దుహాన్‌సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాస్, పార్థ్ తివారి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రెనదివ్, సంగీతం: అజనీష్ లోకనాథ్.