విక్రాంతి, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సమాజంలో యువజంటలు ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నామని, డాక్టర్ భ్రమరంగా వెన్నెల కిశోర్ చేసిన కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కల్యాణ్ రాఘవ్, కెమెరా: మహి రెడ్డి పండుగుల, సంగీతం: సునీల్ కశ్యప్.