జైపూర్, జనవరి 10 : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ డీసీఎంఎస్‌లో ధాన్యం కొనుగోళ్లలో మరో గోల్మాల్ జరిగింది. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకళ.. డీసీఎంఎస్ కేంద్రం నిర్వాహకులు మాదాసు రమేశ్, అతడి భార్య లావణ్యపై జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రమేశ్, లావణ్యపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన లంబు శివప్రసాద్ గతేడాది నవంబర్ 11న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో రూ.38 లక్షల అవినీతి జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు డీసీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంగా ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, కిష్టాపూర్‌కు చెందిన బోగె మల్లయ్య, కొండపర్తి ప్రభాకర్, కటుకూరి రమణారెడ్డి, ఆవునూరి రాకేశ్, మద్దులపల్లికి చెందిన కొండ వెంకటేశ్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.