వాషింగ్టన్: అమెరికాలోని మిసిసిపి రాష్ట్రం క్లే కౌంటీలో శుక్రవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మూడుచోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
బాధిత కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని పోలీసులు కోరారు. కౌంటీలో 20,000 మంది నివసిస్తున్నారు.