Green Fungus : దేశంలో తొలిసారిగా గ్రీన్ ఫంగస్ కేసు నమోదు!
Another danger : దేశంలో తొలిసారిగా గ్రీన్ ఫంగస్ కేసు నమోదు! | దేశంలో కరోనా సెకండ్ వేవ్ వినాశనం సృష్టించింది. పలు రకాల ఫంగస్‌లూ వెలుగులోకి వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్త్ పాటు వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వినాశనం సృష్టించింది. పలు రకాల ఫంగస్‌లూ వెలుగులోకి వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్త్ పాటు వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా తొలిసారిగా గ్రీన్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ వ్యక్తిలో గ్రీన్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. అరబిందో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 34 ఏళ్ల వ్యక్తి పరీక్షలు చేయగా.. సైనస్, ఊపిరితిత్తుల్లో ఫంగస్ జాడలు కనిపించాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వెంటనే అతన్ని ముంబైలోని ఓ హాస్పిటల్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ఇండోర్‌లోని రూబీ ఆర్చర్డ్ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కొద్ది రోజుల కిందట కరోనా బారినపడి కోలుకున్నాడు. అనంతరం కొవిడ్ అనంతర లక్షణాలతో మళ్లీ ఆసుపతిలో చేరాడు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు చేయగా.. ఊపిరితిత్తులు, సైనస్లో ఆస్పెర్గిలోసిస్ ఫంగస్‌ను గుర్తించారు. ఉపిరితిత్తుల్లో 90శాతం ఇన్ఫెక్షన్ జరిగిందని, ఆ తర్వాత అతన్ని చార్టర్డ్ విమానం ద్వారా తరలించగా.. ఇప్పుడు హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి సుమారు ఒకటిన్నర నెలల క్రితం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తుల్లో చీము నిండి ఉందని, దాన్ని తొలగించేందుకు చాలా ప్రయత్నాలు చేసినా విజయవంతం కాలేదని తెలిపారు. చికిత్స సమయంలో, రోగిలో వివిధ రకాల లక్షణాలు గమనించామని, అదే సమయంలో అతనికి జ్వరం 103 డిగ్రీల కంటే దిగువకు చేరలేదని వైద్యులు తెలిపారు. గ్రీన్ ఫంగస్ ఊపిరితిత్తులకు వేగంగా సోకుతోందని, దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సిద్ధమైన ‘నారప్ప’
చీలమండకు అండ!
నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అమెరికాలో ఆరు లక్షలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 62వేల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

