అమరావతి : కర్నూలు జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ( Bus Fire ) ఘటనను మరచిపోక ముందే ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో మరో బస్సు దహనం ఘటన సంచలనంగా మారింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం విశాఖపట్నం( Visakapatnam) నుంచి పార్వతీపురం జయపురకు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఆంధ్ర -ఒడిస్సా ఘాట్ రోడ్డులో ఆకస్మత్తుగా బస్సులో నుంచి పొగలు ప్రారంభమయ్యాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను దించివేశారు. దీంతో ప్రయాణికులకు ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సు ప్రమాదంపై మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి జిల్లా అధికారులను అడిగి తెలుసుఉన్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మంత్రులకు అధికారులు వివరించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేకంగా అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు.