Bapatla Accident | లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం.. వీడియో
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
Bapatla Accident | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్కి వెళ్లారు. అయితే బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 2.34 గంటల సమయంలో బాపట్ల గడియారం స్తంభం కూడలి వద్ద చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అమాంతం ఎగిరిపడి ఘటనా స్థలంలోనే మృతిచెందారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
అతివేగంతో లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి
బాపట్ల జిల్లా కేంద్రంలోని గడియారం స్తంభం వద్ద, చీరాల వైపు నుండి వస్తున్న లారీని, సూర్యలంక వైపు నుండి వస్తూ అతివేగంతో ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన బైక్పై ప్రయాణిస్తున్న… pic.twitter.com/F36NsvyxYU
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2025
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

