
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సమర్పించారు. 5.3 కిలోల బరువుతో కఠి, వరద బంగారు హస్తాలను తయారుచేయించిన భక్తుడు.. శుక్రవారం ఉదయం రంగనాయక మండపంలో టీటీడీ అధికారులకు అందజేశారు. దాత వివరాలను టీటీడీ గోప్యంగా ఉంచింది.