కారేపల్లి, సెప్టెంబర్ 16 : సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డు (రామలింగాపురం)లో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో బుధవారం మేకల రాంబాబు-ఉమా దంపతుల వితరణగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద దాత కుటుంబ సభ్యులు మేకల మానస, మౌనిక, రిస్విత కృష్ణ, గ్రామ పెద్దలు, యవత, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కారేపల్లి క్రాస్ రోడ్ గణపతి మండపం వద్ద మహా అన్నదానం