Anmol Bishnoi : అంతర్జాతీయ కాంట్రాక్ట్ కిల్లర్‌గా, ఆయుధ స్మగ్లర్‌గా పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) కి పాటియాలా కోర్టు (Patiala Court) 11 రోజుల ఎన్ఐఏ రిమాండ్ విధించింది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Laurence Bishnoy) సోదరుడైన అన్మోల్ను అమెరికా అధికారులు మంగళవారం డిపోర్ట్ చేసి భారత్‌కు పంపించారు.
దాంతో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్మోల్ బిష్ణోయ్ దిగగానే ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్టు చేశారు. సాయంత్రం పాటియాలాలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా అన్మోల్ బిష్ణోయ్‌కి న్యాయమూర్తి 11 రోజుల రిమాండ్ విధించారు. దాంతో ఈ 11 రోజులపాటు ఎన్ఐఏ అధికారులు సిద్ధిఖీ హత్యపై ఆన్మోల్‌ను విచారించనున్నారు.
మహారాష్ట్రకు చెందిన బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అమెరికాలో ఉన్న అతడిని భారత్‌కు పంపించాలని బాబా సిద్ధిఖీ కుమారుడు అమెరికా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు అక్కడి అధికారులు బిష్ణోయ్‌ని భారత్‌కు అప్పగించారు. అనంతరం ఎన్ఐఏ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.