Akhanda 2 | టాలీవుడ్ హిట్ కాంబినేషన్ బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) నుంచి వస్తోన్న సీక్వెల్ అఖండ 2 (Akhanda 2). టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు.
మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ అందించి అభిమానులతోపాటు మూవీ లవర్స్‌లో పుల్ జోష్ నింపుతున్నారు. అఖండ 2 ట్రైలర్‌ను నవంబర్ 21న సాయంత్రం 6 గంటలకు చిక్బల్లాపూర్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో లాంచ్ చేయనున్నారు. ఈవెంట్‌కు శాండల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు. బాలకృష్ణ, శివరాజ్‌కుమార్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
దివంగత లెజెండరీ యాక్టర్లు నందమూరి తారకరామారావు, రాజ్‌కుమార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూనే అటు కన్నడ, ఇటు తెలుగు అభిమానుల్లో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బాలకృష్ణ, శివరాజ్ కుమార్. ఈ ఇద్దరూ స్టేజ్ షేర్ చేసుకుంటుండటంతో అఖండ 2 ఈవెంట్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే లాంచ్ చేసిన అఖండ 2 టీజర్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఫస్ట్ పార్టుకు మించిన స్కోర్ సీక్వెల్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
A MASSIVE TRAILER LAUNCH EVENT IN KARNATAKA FOR AKHANDA 2 💥💥#Akhanda2Trailer launch event with ‘Karunada Chakravarthy’ @NimmaShivanna Garu as the chief guest ❤️🔥
📍Chintamani Bypass, Opp. SNR Bricks Factory, Chikballapur
🗓️ 21st November, 6 PM onwards #Akhanda2 IN CINEMAS… pic.twitter.com/D2JIbPg6IP— 14 Reels Plus (@14ReelsPlus) November 19, 2025
Andhra King Taluka | రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైలర్ రిలీజ్
AnnaGaruVostaru | వా వాతియార్ తెలుగు టైటిల్ ఇదే.. హైప్ పెంచుతోన్న కార్తీ నయా లుక్