KCR Birthday Celebrations | కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. పొలాల వద్ద కేసీఆర్ చిత్రపటంతో రైతులు వేడుకలు జరుపుకొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించగా, మరికొన్ని చోట్ల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఓవైపు మొక్కులు చెల్లించుకోగా, మరోవైపు మొక్కలు అందజేశారు. విదేశాల్లోనూ జన్మదిన వేడుకలు జరిగాయి.
హనుమకొండలో కేసీఆర్ బర్త్‌డే సందడి

కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం హనుమకొండ బాలసముద్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
అభిమానం చాటిన అన్నదాతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలోని పచ్చని పొలాల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు

ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల ఎన్నారైలు నిర్వహించిన పుట్టినరోజు కార్యక్రమాల వీడియోను విడుదల చేస్తున్న కేటీఆర్. చిత్రంలో మహేశ్ బిగాల, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మహేశ్ తన్నీరు
కేసీఆర్ కిట్ల పంపిణీ

కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. చిత్రంలో కిట్‌ను అందుకొని మురిసిపోతున్న ఓ తల్లి.
ఉస్మానియా యూనివర్సిటీలో వేడుకలు

ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్. చిత్రంలో పార్టీ నేతలు, విద్యార్థి నాయకులు
రక్తదానం చేసి..

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, తాను కూడా రక్తదానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్. చిత్రంలో ఎన్ఆర్ఐ నర్సింహారావు
మహబూబ్‌నగర్‌లో..

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
శివాలయం వద్ద సంబురాలు

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పర్వతాల శివాలయం వద్ద కేక్ కట్ చేస్తున్న ఎర్రబెల్లి
మొక్కలు పంచి..

కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో మొక్కలు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ నేత లక్ష్మణ్‌రావు తదితరులు
భీమేశ్వరుడికి కోడె మొక్కు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కు చెల్లిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, గజానందరావు, పట్టణ నాయకులు
బహ్రెయిన్‌లో..

కేసీఆర్ జన్మదిన వేడుకలను బహ్రెయిన్‌లో నిర్వహించారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.
కిడ్నీ బాధితుడికి ఆపన్నహస్తం

కేసీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్‌లో కిడ్నీ బాధితుడికి రూ.72వేల ఆర్థికసాయం అందజేస్తున్న ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు
కోస్గిలో కేక్ కోసి..

కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్గిలో బీఆర్ఎస్ నేతలతో కలిసి కేక్ కట్ చేస్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
నిజామాబాద్‌లో..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు
ఖమ్మం గుమ్మంలో..

ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేక్‌కట్ చేసి మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోత్ చంద్రావతి తదితరులు
అమెరికాలో..

అమెరికాలోని ఆస్టిన్‌లోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. కొందరు కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.