కొల్లాపూర్ : ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ( World Fishermens Day ) విజయవంతం చేయాలని మత్స్యకార సంఘం గౌరవ సీనియర్ నాయకులు, డాక్టర్ పగిడాల శ్రీనివాసులు ( Srinivasulu ) పిలుపునిచ్చారు. కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించే కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెనుగొల్ల సాంప్రదాయ మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
బుధవారం కొల్లాపూర్ పట్టణంలోని రాజా ప్యాలెస్ ఆవరణలో డాక్టర్ పగిడాల శ్రీనివాసులు, భయ్య వెంకటస్వామి, సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య లతో మత్స్యకారుల జెండా, ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవానికి ముఖ్య అతిధులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి, ఎంపీ ఈటెల రాజేందర్ , ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు నీలం మధు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి సుధాకర్ రావు, ప్రముఖ నటుడు బిత్తిరి సత్తి, వివిధ పార్టీల నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు.
తెనుగొల్లు సాంప్రదాయ మత్స్యకారులకు ఏ గ్రూప్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు , మత్స్యశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భయ్యా వెంకటస్వామి, తెనుగుల్ల రాష్ట్ర నాయకులు పెబ్బేటి కృష్ణయ్య , మండల అధ్యక్షులు గడ్డి గోపుల ఎల్లయ్య , సొప్పరి వెంకటస్వామి, గుర్రపు శ్రీనివాసులు, గట్టు ఆంజనేయులు, బయ్య రాములు , దర్గేషు, బాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.