నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో త్వరలో ఓ చిత్రం రూపొందనుంది. ఎన్బీకే 108 వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తారు. బాలకృష్ణ-అనిల్ కాంబినేషన్లో మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతుందని చిత్రబృందం తెలిపింది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రానికి సంగీతాన్ని అందించిన థమన్ స్వరాలు అందించబోతున్నాడు. ఇప్పటి వరకు బాలకృష్ణను మునుపెన్నడు చూడని ఓ సరికొత్త మాస్ పాత్రలో అనిల్ చూపించబోతున్నాడని చిత్రయూనిట్ తెలిపింది.