కోల్కతా: ఐపీఎల్-17 సీజన్లో ఆల్రౌండ్ ప్రదర్శనలతో అదరగొడుతున్న విండీస్ వీరుడు సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీపై స్పష్టతనిచ్చాడు. మళ్లీ తనకు అటువైపుగా వచ్చే ఆలోచనే లేదని, ఆ తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. నరైన్ స్పందిస్తూ… ‘ఇటీవల కాలంలో నా ప్రదర్శనల పట్ల సంతృప్తిగా ఉన్నా.
రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న అభిమానుల నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. కానీ రిటైర్మెంట్ నిర్ణయంతో నేను ప్రశాంతంగా ఉన్నా. ఆ తలుపులు (రీఎంట్రీ) ఎప్పుడో మూసుకుపోయాయి. జూన్లో వెస్టిండీస్ తరఫున టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టుకు నా శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు.