కేప్ టౌన్: ఒక సఫారీ వాహనంపై ఏనుగు దాడి చేసింది. దీంతో అందులోని వ్యక్తులు భయంతో వాహనం నుంచి దూకి పరుగులు తీశారు. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్ అంచున ఉన్న సెలాటి గేమ్ రిజర్వ్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ట్రైనీ గైడ్లు సఫారీ వాహనంలో వెళ్తుండగా 13 అడుగుల పొడవైన ఏనుగు దానిపైకి దూసుకువచ్చింది. తొండంతో వాహనాన్ని ఎత్తి పడేసేందుకు ప్రయత్నించింది. దీంతో భయాందోళన చెందిన గైడ్ శిక్షకులు భయంతో అరుస్తూ ఆ వాహనం నుంచి దూకి దూరంగా పరుగులు తీశారు. అనంతరం ఆ పెద్ద ఏనుగు వెనక్కితగ్గి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా, ఏనుగు దాడిలో వాహనం దెబ్బతిన్నప్పటికీ అందులోని వ్యక్తులెవరూ గాయపడలేదని సెలాటి గేమ్ రిజర్వ్ జనరల్ మేనేజర్ బ్రయాన్ హవేమాన్ తెలిపారు. మేటింగ్ సమయంలో మగ ఏనుగులు చాలా దూకుడుగా ఉంటాయని, ఆ సమయంలో మనుషులు కనిపిస్తే అవి దాడి చేస్తాయని చెప్పారు. ఈ ఘటన అనంతరం ట్రైనీ గైడ్లకు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.
మరోవైపు ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియోను ఎకో ఫౌండేషన్‌కు చెందిన వైల్డ్‌లెన్స్ ట్విట్టర్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్ చేశారు.
Noble giant left them unharmed pic.twitter.com/DAk7yO0LU2
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) November 30, 2021