జగిత్యాల, డిసెంబర్ 16, (నమస్తే తెలంగాణ): “జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి ప్రాంతానికి చెందిన రోగులు జగిత్యాలకు రాకుండా చూసుకోండి.. అంటూ వ్యాఖ్యానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్‌కు కామన్సెన్స్ ఉందా?” అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. జగిత్యాల ఎమ్మెల్యేకు దమ్ముంటే రాజీనామా చేయాలని, తాను తన కోరుట్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, జగిత్యాల నుంచి పోటీ చేస్తానని సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాల మెడికల్ కాలేజీని అప్పటి సీఎం కేసీఆర్‌కు చెప్పి మంజూరు చే యించినట్టు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ తన వల్లే జగిత్యాల మెడికల్ కాలేజీకి అనుమతు లు మంజూరు చేసిందని, కేసీఆర్ హయాం లో మెడికల్ కాలేజీకి 20% నిధులు మాత్రమే మంజూరయ్యాయని, సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి రూ.40 కోట్లు మంజూరు చేయించిన ట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని ధ్వజమెత్తారు.
ఇటీవల జగిత్యాల మెడికల్ కాలేజీని పరిశీలించానని తెలిపారు. దీనికే ఉలిక్కిపడ్డ సంజయ్‌కుమార్ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవుపలికారు. జగిత్యా ల జిల్లా మెడికల్ కాలేజీ జిల్లా ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుందన్న కామన్సెన్స్ ఎ మ్మెల్యేకు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సంజయ్‌కుమార్ తన నడుం నొప్పి, మెడ నొప్పుల వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నారని, జగిత్యాలలో వైద్యం చేసుకోకుం డా, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్తున్నారంటూ నిలదీశారు. సమావేశంలో నాయకులు సా యిరెడ్డి, రాజేశ్, దశరథ్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఫహీం, భాసర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.