దమ్ముంటే రాజీనామా చెయ్యి.. నేను జగిత్యాలలో పోటీ చేస్తా
“జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి ప్రాంతానికి చెందిన రోగులు జగిత్యాలకు రాకుండా చూసుకోండి.. అంటూ వ్యాఖ్యానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూ రి సంజయ్‌కుమార్‌కు కామన్సెన్స్ ఉందా?” అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.
- జగిత్యాల ఎమ్మెల్యేకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సవాల్
- వైద్యానికి జిల్లా కేంద్రానికి వచ్చే హక్కు ప్రజలకు లేదా అని ఆగ్రహం
జగిత్యాల, డిసెంబర్ 16, (నమస్తే తెలంగాణ): “జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి ప్రాంతానికి చెందిన రోగులు జగిత్యాలకు రాకుండా చూసుకోండి.. అంటూ వ్యాఖ్యానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్‌కు కామన్సెన్స్ ఉందా?” అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. జగిత్యాల ఎమ్మెల్యేకు దమ్ముంటే రాజీనామా చేయాలని, తాను తన కోరుట్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, జగిత్యాల నుంచి పోటీ చేస్తానని సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాల మెడికల్ కాలేజీని అప్పటి సీఎం కేసీఆర్‌కు చెప్పి మంజూరు చే యించినట్టు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ తన వల్లే జగిత్యాల మెడికల్ కాలేజీకి అనుమతు లు మంజూరు చేసిందని, కేసీఆర్ హయాం లో మెడికల్ కాలేజీకి 20% నిధులు మాత్రమే మంజూరయ్యాయని, సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి రూ.40 కోట్లు మంజూరు చేయించిన ట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని ధ్వజమెత్తారు.
ఇటీవల జగిత్యాల మెడికల్ కాలేజీని పరిశీలించానని తెలిపారు. దీనికే ఉలిక్కిపడ్డ సంజయ్‌కుమార్ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవుపలికారు. జగిత్యా ల జిల్లా మెడికల్ కాలేజీ జిల్లా ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుందన్న కామన్సెన్స్ ఎ మ్మెల్యేకు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సంజయ్‌కుమార్ తన నడుం నొప్పి, మెడ నొప్పుల వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నారని, జగిత్యాలలో వైద్యం చేసుకోకుం డా, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్తున్నారంటూ నిలదీశారు. సమావేశంలో నాయకులు సా యిరెడ్డి, రాజేశ్, దశరథ్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఫహీం, భాసర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

