సూదీదారం అమ్మానాన్నఅయితే..అందమైన బిడ్డ ఎంబ్రాయిడరీ. చమ్కీల చమక్కులు, అద్దాల వెలుగులు, రాళ్ల మెరుపులు, పూసల రంగుల జుగల్బందీ ఈ కళ. బంగారం, వెండి, ఇతర లోహాలతో చేసిన ఆభరణాలకు వింత వన్నెల ఎంబ్రాయిడరీ సొబగులద్ది భలే అందంగా మలుస్తున్నారు.
నిజానికి, ఈ కళ చాలా ప్రాచీనం.గోండు, లంబాడీ వంటి తెగల వస్ర్తాల్లో, ఆభరణాల్లో ఎంబ్రాయిడరీ పాత్ర కీలకం. ఇప్పుడు, ఆధునిక ఆభరణాల వరుసలోనూ చేరిపోయింది. పల్చని లోహపు రేకులపై చేసే ఎంబ్రాయిడరీ వల్ల నగలు తేలికగా, సౌకర్యంగా ఉంటాయి. ధర కూడా తక్కువే.