ములుగు : ములుగు జిల్లా వెంకటాపురం నూగురు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. బుధవారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎన్నికల సిబ్బంది రెమ్యునేషన్ చెల్లింపు విషయంలో ఎంపీడీవోతో గొడవపడ్డారు.
సిబ్బందితో జరిగిన గొడవ కారణంగా ఎంపీడీవో అస్వస్థకు గురికాగా సిబ్బంది ఎటూరునాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ నుండి హనుమకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.