సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో మల్లన్న ఆలయ ఉప ఆలయంగా కొనసాగుతున్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ ఈవో ఏ.బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహిస్తున్నారు.
రెండో రోజున వేద పండితులు, అర్చకులు మంగళవాద్యఘోష, ఆవాహిత, మంటపదేవతారాదనలు, మంటప దేవతా హవనములు, చండీ హోమం, దాన్యాది వాసం, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 6గంటలకు మంగళవ్యా సేవ, ఆవాహిత మంటప దేవతారాదనములు, విశేష మూలమంత్ర హవనములు, మహాస్వపనముల, న్యాస ప్రకరణం, ఘృత, గంద, పుష్ప, దూప, వస్త్ర, ఫల సాధి సుగందద్రవ్యాది, శయ్యాదివాసములు, రాజోపచారములు, నిద్రాకళశస్ధాపన, మహా మంగళ హారతి పూజలు నిర్వహించారు.