రావల్పిండి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఇమ్రాన్ కుమారుడు ఖాసీం ఖాన్ స్పందించాడు. తన తండ్రి సజీవంగా ఉన్నట్టు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ‘నెలన్నరగా మా నాన్నను ఎవరినీ కలవనీయకుండా డెత్ సెల్లో ఉంచారు.
కోర్టు ఆదేశాలున్నా, ఆయనను కలిసేందుకు అనుమతించడం లేదు. ఆయన సజీవంగా ఉన్నట్టు ప్రభుత్వం మాకు ఆధారాలు చూపాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.