వేసవి వచ్చిందంటే ఎండలే కాదు.. మామిడి కూడా గుర్తుకు వస్తుంది. పుల్లగా, తియ్యగా నోరూరించే మామిడి కోసం అందరూ ఎదురుచూస్తారు. చాలామంది మామిడి కాయ, పండు తినేసి టెంక పారేస్తారు. కానీ టెంక వల్ల చాలా ఉపయోగాలున్నాయి తెలుసా!
మామిడి టెంకను పొడి చేసుకొని జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలిపి వండి వేడి వేడి అన్నంతో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
ఉదర సంబంధ వ్యాధులకు మామిడిటెంక మంచి ఔషధం మామిడిటెంక పొడిని మజ్జిగలో కలిపి కాస్త ఉప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మామిడి టెంకలోని గింజను చూర్ణం చేసి రోజుకు మూడు గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. దగ్గు సమస్యలు తగ్గుతాయి.
మామిడిటెంకలోని జీడిని పొడి చేసి దాన్ని మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. మామిడిటెంకలోని ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి.
తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టాలంటే మామిడిటెంక పొడిలో కొబ్బరి, ఆలీవ్, ఆవనూనెలు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి ఐప్లె చేస్తే చర్మం మెరిసిపోతుంది.
పుచ్చకాయ విత్తనాలతో అద్భుతమైన లాభాలు..!
ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే..!
రోగ నిరోధక శక్తి పెంచే జ్యూస్లు ఇవే..
వేసవిలో నిత్యం ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే ఎందుకంటే..?
తిప్పతీగ ఎన్ని తిప్పలు తగ్గిస్తుందో తెలుసా..!