Whatsapp | మనం వాడే వాట్సాప్ గ్రూప్స్‌లో ఇప్పుడు 1,024 మంది వరకు సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద గ్రూప్‌లో ఎవరు ఎవరో గుర్తుపట్టడం, ముఖ్యమైన ఈవెంట్లను ఫాలో అవ్వడం కొన్నిసార్లు తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ మెటా సంస్థ మూడు అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చింది. గ్రూప్ చాటింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేసేలా ఈ అప్డేట్లు ఉన్నాయి.
వీటిలో ఒకటి ‘మెంబర్ ట్యాగ్స్’.. దీనితో గ్రూప్ సభ్యులకు మనకు నచ్చిన పేర్లు లేదా ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ‘అన్నా’ ‘డ్యూడ్’ లేదా వారి రోల్‌ను బట్టి ‘గోల్ కీపర్’.. లాంటి కస్టమ్ లేబుల్స్ ఇచ్చుకోవచ్చు. దీంతో వందల మందిలో మనకు కావలసిన వ్యక్తిని సెర్చ్ చేయడం ఈజీ అవుతుంది. రెండు ‘టెక్ట్స్ స్టికర్స్’.. మీరు టైప్ చేసిన పదాన్ని వెంటనే స్టికర్‌గా మార్చుకోవచ్చు.
ఇక మూడు ‘ఈవెంట్ రిమైండర్స్’.. గ్రూప్‌లో ఏ ఈవెంట్ ఉన్నా ముందే రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్లు 1000 మందికి పైగా సభ్యులు ఉన్న పెద్ద గ్రూప్‌లలో మన పనిని చాలా ఈజీ చేస్తాయి. 2జీబీ వరకు ఫైల్ షేరింగ్, హెచ్డీ మీడియా, స్క్రీన్ షేరింగ్ లాంటి ఫీచర్లతో వాట్సాప్ తన గ్రూప్స్‌ని మరింత పవర్‌ఫుల్‌గా మార్చేసింది. ఎప్పటిలాగే ఈ మెసేజ్‌లన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో సురక్షితంగా ఉంటాయి.