Whatsapp | వాట్సాప్‌లో ఇక జాతరే.. గ్రూప్ చాటింగ్ కోసం అదిరిపోయే ఫీచర్లు తెచ్చిన మెటా
Whatsapp | మనం వాడే వాట్సాప్ గ్రూప్స్‌లో ఇప్పుడు 1,024 మంది వరకు సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద గ్రూప్‌లో ఎవరు ఎవరో గుర్తుపట్టడం, ముఖ్యమైన ఈవెంట్లను ఫాలో అవ్వడం కొన్నిసార్లు తలనొప్పిగా మారుతుంది.
Whatsapp | మనం వాడే వాట్సాప్ గ్రూప్స్‌లో ఇప్పుడు 1,024 మంది వరకు సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద గ్రూప్‌లో ఎవరు ఎవరో గుర్తుపట్టడం, ముఖ్యమైన ఈవెంట్లను ఫాలో అవ్వడం కొన్నిసార్లు తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ మెటా సంస్థ మూడు అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చింది. గ్రూప్ చాటింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేసేలా ఈ అప్డేట్లు ఉన్నాయి.
వీటిలో ఒకటి ‘మెంబర్ ట్యాగ్స్’.. దీనితో గ్రూప్ సభ్యులకు మనకు నచ్చిన పేర్లు లేదా ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ‘అన్నా’ ‘డ్యూడ్’ లేదా వారి రోల్‌ను బట్టి ‘గోల్ కీపర్’.. లాంటి కస్టమ్ లేబుల్స్ ఇచ్చుకోవచ్చు. దీంతో వందల మందిలో మనకు కావలసిన వ్యక్తిని సెర్చ్ చేయడం ఈజీ అవుతుంది. రెండు ‘టెక్ట్స్ స్టికర్స్’.. మీరు టైప్ చేసిన పదాన్ని వెంటనే స్టికర్‌గా మార్చుకోవచ్చు.
ఇక మూడు ‘ఈవెంట్ రిమైండర్స్’.. గ్రూప్‌లో ఏ ఈవెంట్ ఉన్నా ముందే రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్లు 1000 మందికి పైగా సభ్యులు ఉన్న పెద్ద గ్రూప్‌లలో మన పనిని చాలా ఈజీ చేస్తాయి. 2జీబీ వరకు ఫైల్ షేరింగ్, హెచ్డీ మీడియా, స్క్రీన్ షేరింగ్ లాంటి ఫీచర్లతో వాట్సాప్ తన గ్రూప్స్‌ని మరింత పవర్‌ఫుల్‌గా మార్చేసింది. ఎప్పటిలాగే ఈ మెసేజ్‌లన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో సురక్షితంగా ఉంటాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

