Rashtrapati Bhavan | రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అమరావతి చట్టబద్ధత బిల్లు
Rashtrapati Bhavan | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదించి లోక్‌సభ, రాజ్యసభ బిల్లు సోమవారం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ( Amaravati Legitimacy Bill) కల్పిస్తూ ఆమోదించి లోక్‌సభ, రాజ్యసభ బిల్లు సోమవారం రాష్ట్రపతి భవన్ ( Rashtrapati Bhavan) కు చేరుకుంది. బిల్లుపై న్యాయ నిపుణులను సంప్రదించాక ఈ రోజే రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి . రాష్ట్రపతి ఆమోదం అనంతరం అమరావతి బిల్లు చట్టరూపం దాల్చనుంది.
రాష్ట్ర విభవన నాటి నుంచి నేటి వరకు ఏపీకి రాజధాని లేకుండా పోయింది. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీకి నూతన రాజధాని అమరావతి ఉంటుందని అందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల పేరిట గందరగోళం సృష్టించారు.
అమరావతి రైతులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమై వ్యతిరేకించాయి . 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకి రావడం, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు కీలక భాగస్వామ్యంగా మారడంతో అమరావతి రాజధానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ వచ్చింది.
చివరకు కేంద్రం సూచనలతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చట్ట సవరణ బిల్లుకు తీర్మానం చేసి పంపడం, రెండు రోజుల్లోనే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో ప్రవేశ పెట్టి మూజువాణి ఓటుతో ఈ తీర్మానానికి ఆమోదం తెలుపడంతో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

