ఆత్మకూర్ ఎస్, అక్టోబర్ 5 : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000ల బ్యాచ్ పూర్వ విద్యార్తుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠవాల ప్రాంగణంలో ఉత్సాహంగా జరిగింది. పూర్వ విద్యార్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50మంది పూర్వ విద్యార్తులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పాఠశాలలో గతంలో సేవలందించిన ఉపాధ్యాయులు సిహెచ్.రాంరెడ్డి, తంగెళ్ళ పెద వీరారెడ్డి, కాసర్ల వీరారెడ్డి, శంకర్, చల్లా సత్యనారాయణ, సోమయ్య, జి.సుధాకర్‌రెడ్డి, వి.యాదయ్యలను సన్మానించారు. పూర్వ విద్యార్థులు మధు, రవి, సుచరిత, పార్వతమ్మలు కార్యక్రమాన్ని సమన్వయం చేసి పాఠశాల పట్ల తమకున్న అనుబందాన్ని స్మరించుకొని విద్యార్తుల మేలు కోసం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.