హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు, పెద్దలకు మొబైల్ యాప్స్ మంచి ఆటవిడుపుగా మారాయి. వీటి సాయంతో ఎంతోమంది ఎలాంటి ఆటలైనా స్మార్ట్ఫోన్లలోనే ఆడేస్తున్నారు. ఫలితంగా గేమింగ్ యాప్స్ నానాటికీ విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 68,38,894 మొబైల్ యాప్స్‌లో గేమింగ్ యాప్స్ వాటా 21.4 శాతానికి పైమాటే. ఆ తర్వాతి స్థానాల్లో వ్యాపారం (10.1%), విద్య (8.67%), లైఫ్‌ైస్టెల్ (8.61%) రంగాల యాప్స్ ఉన్నాయి. ప్రపంచ మొబైల్ యాప్ మార్కెట్లో గూగుల్ (34,82,452 యాప్స్), ఆపిల్ (22,26,823 యాప్స్) సంస్థలే రాజ్యమేలుతున్నాయి. మార్కెట్లో 95% వాటాను కైవసం చేసుకొన్న ఈ రెండు కంపెనీలు ఇప్పటికీ నువ్వా-నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి.
గతేడాది చివరినాటికి ప్రపంచ మొబైల్ యాప్ మార్కెట్ విలువ 170.52 బిలియన్ డాలర్లు (రూ.12.67 లక్షల కోట్లు)గా ఉన్నది. ఇది ఏటా 11.5 శాతం వృద్ధితో 2027 నాటికి 366.34 బిలియన్ డాలర్లకు (రూ. 27.23 లక్షల కోట్లకు) చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల కంటే స్మార్ట్ఫోన్ల వినియోగమే భారీగా పెరుగుతుండటంతో యాప్ డెవలపర్లలో అత్యధికులు మొబైల్ యాప్స్ తయారీకే మొగ్గు చూపుతున్నారు. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐవోఎస్ 99 శాతం వాటాతో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తుండటంతో డెవలపర్లంతా తమ యాప్స్‌ను ఈ రెండు స్టోర్లలోనే ఉంచుతున్నారు.
ట్రెండ్‌కు తగ్గట్టుగా…
4జీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. కరోనా సమయంలో జనమంతా ఇండ్లకే పరిమితం కావాల్సి రావడంతో మొబైల్ యాప్స్ వినియోగం జోరందుకొన్నది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా టెక్ కంపెనీలు ప్రతి పనికీ ప్రత్యేకమైన యాప్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం పలు రకాల సేవలను ‘టీయాప్ ఫోలియో’ యాప్ ద్వారా ప్రజలకు అందిస్తున్నది. దీని ద్వారా రాష్ట్ర ప్రజలు 30 రకాలకుపైగా సేవలను పొందుతున్నారు.
ప్రపంచంలో మొత్తం యాప్స్
గూగుల్ ప్లేస్టోర్ 34,82,452
ఆపిల్ యాప్ స్టోర్ 22,26,823
విండోస్ స్టోర్ 6,69,000
అమెజాన్ యాప్ స్టోర్ 4,60,619
మొత్తం 68,38,894
టాప్-10 యాప్స్
1 టిక్‌టాక్
2 ఫేస్బుక్
3 ఇన్స్టాగ్రామ్
4 వాట్సాప్
5 టెలిగ్రామ్
6 మోజ్
7 జూమ్
8 స్నాప్‌చాట్
9 మెసెంజర్
10 ఎంఎక్స్ టకా టక్