అలంపూర్ చౌరస్తా, మే 9 : జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం శేరుపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని శనివారం ఉదయం 8:30 గంటలకు సర్పంచ్ అశ్వినితో కలిసి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత..
కాంగ్రెస్ నాయకులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన దొడ్డప్పతోపాటు పలువురు సర్పంచ్ అశ్వినితో మరోసారి రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు. ఒకే గ్రామ పంచాయతీ భవనాన్ని రెండు సార్లు ప్రారంభించడం ఏమిటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.