భూత్పూర్ను కరువు మండలంగా ప్రకటించాలి
కరువు మండలాల ప్రకటనలో రాజకీయం తగదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే ఆల డిమాండ్
- భూత్పూర్లో ర్యాలీ, ధర్నా.. తహసీల్దార్‌కు వినతిపత్రం
భూత్పూర్, అక్టోబర్ 30 : కరువు మండలాల ప్రకటనలో రాజకీయం తగదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల
వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరును కరువు మండలంగా ప్రకటించాలని
డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆల పార్టీ శ్రేణులతో
కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ.. భూత్పూర్లో పంటలు ఎండిపోయినా ప్రభుత్వం కరువు మండలంగా
ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరును కరువు ప్రాంతంగా
ప్రకటించకపోవడంతో.. జిల్లాపై ఆయనకున్న ప్రేమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఉమ్మడి
జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. వరద జలాలను ఆంధ్రాకు సీఎం చంద్రబాబు తరలించుకుపోతుంటే
రేవంత్‌రెడ్డితోపాటు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు మొద్దు నిద్ర పోతున్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

