400 ఎకరాల ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం
శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101లో 532 ఎకరాల ప్రభుత్వ భూమిని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఇతర విభాగాల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
- రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి
- మియాపూర్‌లో భూమి పరిశీలన
మియాపూర్ , అక్టోబర్ 30 : శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101లో 532 ఎకరాల ప్రభుత్వ భూమిని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఇతర విభాగాల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. మియాపూర్‌లోని విలువైన భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తాజాగా గురువారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఈ స్థలంతో పాటు, చుట్టూ ఫెన్సింగ్, ఇప్పటికే ఉన్న నిర్మాణాలను పరిశీలించారు.
మొత్తం 550.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 400 ఎకరాల వరకు ఖాళీగా ఉన్నదని, కోర్టు తీర్పు అనంతరం ఆ భూమిని పూర్తిగా తాము స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపారు. మిగిలిన స్థలంలో నిర్మాణాలు, కాలనీలు ఏర్పడ్డాయని వాటి పరంగా నివాసితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వీటిపై న్యాయపరంగా తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ భూమి పరిరక్షణకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రెండేండ్ల క్రితమే సింహభాగం ఫెన్సింగ్ వేశామని, కొంత మేర మిగిలి ఉంటే అక్కడ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. రెండు సర్వే నంబర్లలో ఉన్న భూమి విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు.
భూమి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపడుతామని చెప్పారు. 1912లోనే ఇది ప్రభుత్వ పోరంబోకు భూమిగా రికార్డుల్లో స్పష్టంగా నమోదైందని వివరించారు. 1950-51లో ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి అధికారులు కొందరు ప్రైవేట్ వ్యక్తుల పేర్లను రికార్డుల్లో నమోదు చేశారని చెప్పారు. కలెక్టర్ వెంట హెచ్‌జీసీఎల్ హెచ్ఎండీఏ ఈవో ఉపేందర్‌రెడ్డి, జోనల్ కమిషనర్ చంద్రకళ, రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్, శేరిలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, హెచ్ఎండీఏ ఎంఆర్వో దివ్యారెడ్డి తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

