హిట్లు, ఫ్లాపులు పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్. ఎట్టిపరిస్థితుల్లో ఆయన నుంచి ఏడాదికి రెండుమూడు సినిమాలైతే కచ్చితంగా వస్తుంటాయి. ఆ విధంగా తన అభిమానులకు చేరువగా ఉంటారాయన. రీసెంట్గా ఓ సినిమా ప్రెస్మీట్లో పాల్గొన్న అక్షయ్ తన సక్సెస్ సీక్రెట్‌ను వివరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ మాటలు వైరల్‌గా మారియి. ‘పని చేయడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఫలితం మన చేతిలో ఉండదు. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతా. నా సినిమాల జయాపజయాల గురించి అస్సలు ఆలోచించను.
ఫలితం ఏదైనా పట్టించుకోను. లైఫ్‌లో డబ్బు, ఫేమ్ వీటన్నింటికంటే మించింది మనశ్శాంతి. విజయాన్నీ, డబ్బునీ తలకెక్కించుకుంటే మనశ్శాంతి లోపిస్తుంది. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలను సాధించినా వాటికి అర్థం ఉండదు.’ అని చెప్పుకొచ్చారు అక్షయ్‌కుమార్. డబ్బు ప్రాధాన్యతను మీ అమ్మాయికి నేర్పిస్తారా? అని అడగ్గా.. ‘అది నేర్పాల్సిన పనిలేదు. కష్టపడి సంపాదించేవాళ్లకు ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది.’ అన్నారు అక్షయ్.