సుధీర్‌బాబు, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులు. భారతీయ పౌరాణిక ఇతివృత్తాల ఆధారంగా భారీ గ్రాఫిక్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 7న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు. బుధవారం ‘ట్రెండ్ సెట్ చెయ్’ అనే గీతాన్ని విడుదల చేశారు. రీస్ అండ్ జైన్ కంపోజ్ చేసిన పాట యూత్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంది.
శ్రీమణి తెలుగు, ఇంగ్లీష్ కలబోతగా ట్రెండీగా పాటను రాశారు. జితేందర్, రాజీవ్ రాజ్ ఆలపించారు. పబ్సెట్లో తెరకెక్కించిన ఈ పాట యూత్‌ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. దుష్టశక్తికి, దైవత్వానికి మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఇందులో హీరో సుధీర్‌బాబు లోకరక్షకుడి పాత్రలో కనిపిస్తాడని దర్శకుడు తెలిపారు. జీ స్టూడియోస్, ఎస్కే ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.