సాధారణంగా యాడ్ ఫిల్మ్స్‌ను తక్కువ బడ్జెట్‌తో రూపొందిస్తుంటారు. అతిపెద్ద బహుళజాతి కంపెనీలు తయారుచేసే యాడ్స్ బడ్జెట్ కూడా 20-30కోట్ల మధ్యే ఉంటుంది. కానీ ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఓ యాడ్‌కు దాదాపు 150కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం సంచలనంగా మారింది. చింగ్ దేశీ చైనీస్ అనే ప్రాసెస్డ్ఫుడ్ మేకింగ్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి 150కోట్లతో అట్లీ దర్శకత్వంలో భారీ యాడ్ ఫిల్మ్స్‌ను రూపొందిస్తున్నది. దాదాపు అగ్రహీరో సినిమా బడ్జెట్‌కి ఇది సమానం కావడం విశేషం.
ఆ యాడ్ ఫిల్మ్‌లో రణవీర్‌సింగ్, బాబీ డియోల్, శ్రీలీల నటిస్తున్నారు. షారుఖ్‌ఖాన్‌తో తీసిన ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తుంపును తెచ్చుకున్నారు దర్శకుడు అట్లీ. ఈ నేపథ్యంలో చైనీస్ కంపెనీ ఆయనకు ఈ భారీ యాడ్ ప్రాజెక్ట్‌ను అప్పగించడం విశేషం. అట్లీ తనదైన శైలి భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, మల్టీపుల్ లోకేషన్స్‌తో ఈ యాడ్‌ను సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కలిగించేలా తీర్చిదిద్దుతున్నాడట. ఏదిఏమైనా ఇండియాలో రూపొందించే కాస్ట్లియెస్ట్ యాడ్ ఇదేనని ట్రేడ్ వర్గాలంటున్నాయి.