హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సీజేపీ సభను విజయవంతం చేయాలన్నారు.