హైదరాబాద్, ఆట ప్రతినిధి: పట్టుదల,క్రమశిక్షణ, ఏకాగ్రతే తన విజయ రహస్యమని భారత స్టార్ షూటర్, హైదరాబాదీ ఇషా సింగ్ తెలిపింది. అంతర్జాతీయ ఈవెంట్లలో తనకంటే వయసులో పెద్ద, మేటి షూటర్లు బరిలో ఉన్నా.. ఏకాగ్రత కోల్పోకుండా లక్ష్యంపైనే గురి పెట్టడం వల్లే ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. మ్యూనిక్ వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న ఇషాను హైదరాబాద్‌లో లైఫ్‌స్పాన్ సంస్థ ఘనంగా సన్మానించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలిసి లైఫ్‌స్పాన్ అధినేత డాక్టర్ నరేంద్ర రామ్ ఇషా సింగ్‌కు రూ. 3 లక్షల నగదు అందించారు.