సిడ్నీ: భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సింధు 20-22, 12-21తో టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి అకానె యామగూచి చేతిలో వరుస గేమ్స్‌లో ఓటమి చవిచూసింది. 43 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో, తొలి గేమ్‌లో సింధు గట్టి పోటీ ఇచ్చి ఒక దశలో గేమ్ పాయింట్ సాధించినప్పటికీ దాన్ని గెలుపుగా మలచడంలో విఫలమైంది. రెండో గేమ్‌లో యమగూచి పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.