హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : తెలుగు సంస్కృతి కళావైభవాన్ని 140 ఏండ్లుగా తరతరాలకు అందిస్తూ ప్రజలను అలరిస్తున్న ‘సురభి’ నాటక రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ డిమాండ్ చేశారు.
శనివారం సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మణికొండలోని రావినారాయణ రెడ్డి స్మారక ట్రస్టు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సురభి సంస్థలు సమాజానికి విలువలు, చైతన్యం అందించే కళానిలయాలని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొనసాగుతున్న సంప్రదాయ నాటకరంగం, రంగస్థల కళాకారులను ఆదుకునేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.