ముంబై, ఫిబ్రవరి 9: అలయన్స్ ఎయిర్ ఏటీఆర్ విమానానికి ప్రమాదం తప్పింది. ఇంజిన్ కవర్(కౌలింగ్) లేకుండానే టేకాఫ్ అవడం భయాందోళనకు దారితీసింది. ఈ సమయంలో విమానంలో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ముంబై నుంచి బయలుదేరిన విమానం గుజరాత్‌లోని బుజ్‌లో క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. ఇంజిన్ కవర్‌ను అధికారులు విమానం టేకాఫ్ తర్వాత ముంబై ఎయిర్‌పోర్టు రన్‌వేపై స్వాధీనం చేసుకున్నారు. టేకాఫ్‌కు ముందే ఇది పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. కౌలింగ్ లేకుండా విమానం ఎగరడం వలన ఎరోడైనమిక్ ప్రభావం విమానం పనితీరులో స్వల్ప క్షీణతకు దారితీస్తుందని, అదేవిధంగా గాలి వలన ఇంజిన్ పరికరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.