న్యూఢిల్లీ: దీపావళి తర్వాత ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మంగళవారం ప్రభుత్వం చేపట్టిన ‘మేఘ మథనం’ (క్లౌడ్ సీడింగ్) విఫలమైంది. ప్రక్రియ పూర్తయి నాలుగు గంటలైనా వర్షాలు కురవకపోవడం అందరినీ నిరుత్సాహపర్చింది.
ప్రయోగానికి ఉపయోగించిన విమానం కాన్పూర్ నుంచి బయల్దేరి 6,000 అడుగుల ఎత్తులో రసాయనాలను వెదజల్లింది.