గువాహటి: మతంతో సంబంధం లేకుండా అస్సాంలో బహు భార్యత్వాన్ని నిషేధించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ సోమవారం వెల్లడించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి కనిష్ఠంగా ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు.
ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 25న శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. ‘ఒక వ్యక్తి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెండ్లాడితే.. అతడికి ఏడేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే నిబంధన బిల్లులో ఉంది’ అని అమ్మాయిలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమంలో హిమంత అన్నారు.