న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఎస్జే-100 పౌర ప్రయాణికుల విమానాలను ఇక నుంచి భారత్‌లో కూడా తయారు చేయనున్నారు. ఈ మేరకు రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్‌తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
చిన్న నగరాలకు విమాన ప్రయాణం అందించే విషయంలో ఇది గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని భావిస్తున్నారు. మంగళవారం మాస్కోలో హెచ్ఏఎల్ ఎండీ, చైర్మన్ డీకే సునీల్, రష్యా కంపెనీ డీజీ వదీప్ బెడెకా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.