Air India Express | విజయవాడ నుంచి బెంగళూరు (Vijayawada-Bengaluru flight) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India Express) విమానం రద్దైంది. గురువారం ఉదయం ఫ్లైట్ విజయవాడ రన్‌వే (runway)పై ఉండగా నోస్ భాగాన్ని పక్షి ఢీ కొట్టింది (bird strike). దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఫ్లైట్‌ను రద్దు చేశారు. టేకాఫ్ కోసం రన్‌వేపై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్‌కు ముందే పక్షి ఢీ కొట్టినట్లు అధికారులు తెలిపారు. ఘటన తర్వాత విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేసింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Traffic Jam | ట్రాఫిక్‌తో విసుగెత్తి.. బైక్‌ను భుజంపై వేసుకొని.. వైరల్ వీడియో
P Chidambaram | ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు పట్టింది.. టూ లేట్.. జీఎస్టీ తగ్గింపుపై చిదంబరం
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి