Lilo And Stitch | హాలీవుడ్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న లైవ్ యాక్షన్ చిత్రం ‘లిలో అండ్ స్టిచ్’ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించగా.. మైయా కీలోహా, సిడ్నీ అగుడాంగ్, క్రిస్ సౌండర్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్, రైడ్బ్యాక్ సంయుక్తంగా నిర్మించాయి. మే 23న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9123 కోట్ల వసూళ్లను సాధించి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హవాయిలోని ఒక ద్వీపంలో తల్లిదండ్రులు చనిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తున్న లిలో అనే చిన్నారి జీవితంలోకి స్టిచ్ అనే ఒక గ్రహాంతరవాసి ప్రవేశిస్తాడు. స్టిచ్ చూడడానికి కుక్కపిల్లల ఉండడంతో కుక్కని పెంచుకుంటున్నాను అనుకోని లీలో స్టిచ్ని ఇంటికి తెచ్చుకుంటుంది. అయితే స్టిచ్ లీలో జీవితంలోకి ప్రవేశించాక జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ.
Come for the chaos. Stay for the Ohana.
Lilo & Stitch, now streaming in English, Hindi, Tamil and Telugu only on JioHotstar. pic.twitter.com/O6AbnQsfs0
— JioHotstar (@JioHotstar) September 3, 2025