సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం ‘గోట్’. మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాత. క్రికెట్ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
మంగళవారం అగ్ర నిర్మాత దిల్‌రాజు టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా దైర్యంగా ముందుకెళ్లామని, సమాజంలోని ఓ సమస్యను చర్చిస్తూ సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తీశామని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణ సంస్థ: జైశ్నవ్ ప్రొడక్షన్, మహాతేజ క్రియేషన్స్.