Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
Pakistani pilots : ఇటీవల ఫ్లైదుబాయ్ విమాన ఘటనను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ అనే విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లను నిషేధించింది.
Pakistani pilots : ఇటీవల ఫ్లైదుబాయ్ విమాన ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తూనే.. కీలక నిర్ణయాలకు ఉపయోగపడింది. ఈ ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ అనే విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లను నిషేధించింది. దీనికి ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయమే కారణం.
తమతో దౌత్య సంబంధాలు లేని, అలాగే, ద్వంద్వ పౌరసత్వం కలిగిన దేశాలకు చెందిన విమానయాన సిబ్బందిని ఇజ్రాయెల్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే.. ఇజ్రాయెల్ నుంచి ఇతర చోట్లకు వెళ్లే విమానాల్లో.. అలాగే ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్ వచ్చే విమానాల్లో.. తమ దేశంతో శతృత్వం కలిగిన దేశాల సిబ్బంది, అలాగే దౌత్య సంబంధాలు లేని దేశాల సిబ్బంది పని చేయడానికి వీల్లేదు. అలాంటి పైలట్లు, ఇతర సిబ్బంది ఉన్న విమానాల్ని ఇజ్రాయెల్ నిషేధించింది. ఈ నిర్ణయం శతృదేశాలకు సంబంధించిన వారు ఇతర దేశ విమాన సంస్థల్లో పని చేసినా వర్తిస్తుంది.
పాకిస్తాన్‌తో ఇజ్రాయెల్‌కు సత్సంబంధాలు లేవు. కాబట్టి, పాకిస్తాన్ పైలట్ అమెరికా విమానయాన సంస్తలో పని చేసినా సరే.. తమ దేశానికి వచ్చే విమానాల్లో విధులు నిర్వహించడానికి వీల్లేదు. ఇజ్రాయెల్‌కు 31 దేశాలతో సత్సంబంధాలు లేవు. దీంతో ఆయా దేశాల సిబ్బంది ఏ దేశ విమాన సంస్థల్లో పని చేసినా సరే.. ఇజ్రాయెల్ రావడానికి అనుమతించదు. ఇతర దేశాలకు ఆయా సిబ్బంది వెళ్లొచ్చు. ఈ నిషేధిత దేశాల జాబితాలో పాకిస్తాన్ కూడా ఉంది. అందుకే, పాక్ సిబ్బందిని ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో నిషేధిస్తున్నట్లు ఎయిర్ ఫ్రాన్స్ ప్రకటించింది.
దీనివల్ల ప్రధానంగా ముస్లిం దేశాల సిబ్బందిపై నిషేధం అమలవుతుంది. పాకిస్తాన్‌తోపాటు అల్జీరియా, ట్యునీసియా, ఇరాన్, ఒమన్, సౌదీ అరేబియా, నైగర్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, బ్రూనే, కొమోరోస్, క్యూబా, జిబూటి, ఇండోనేసియా, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, మలేసియా, మాల్దీవ్స్, మాలి, మౌరటేనియా, ఉత్తర కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజువెలా, యెమెన్ దేశాల సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే ఇతర దేశాల విమానయాన సంస్థలు కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేయనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Air France
- Israel
- Pakistan
- pilots
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

