సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ...
రుద్రంపూర్, అక్టోబర్ 14 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం సీహెచ్. వెంకటరమణ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకని, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు.
ఇటువంటి పండుగలు ఉద్యోగుల మధ్య ఐక్యత, సోదరభావం, ఆత్మీయతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ వేడుకలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలతో ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యాలయ ప్రాంగణం పూల అందాలతో, పండుగ శోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు గీతారాణి, ఎస్వో టు జీఎం ఎం. గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, డీవైపీఎం హరీష్, మహిళా ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

