కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం కొత్తగూడెం టౌన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. ఇటీవల సైనస్ సర్జరీ చేయించుకుని...
రుద్రంపూర్, అక్టోబర్ 14 : కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం కొత్తగూడెం టౌన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. ఇటీవల సైనస్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు పూర్ణను పరామర్శించారు. అలాగే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన తండ్రి బానోత్ సాంగు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు ఖాజాను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యకర్తలకు కష్టసమయాల్లో తోడుగా నిలవడం పార్టీ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోగరు రాజశేఖర్, ఖాజా భక్ష్, షరీఫ్, నాగరాజు పాల్గొన్నారు.

కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
అర్హులైన పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం కొత్తగూడెం టౌన్ పరిధిలోని రామవరంలో తన నివాస ప్రాంగణంలో ఉచిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన అర్హులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా ఓటరు నమోదు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోగరు రాజశేఖర్, ఖాజా భక్ష్, షరీఫ్, వీర్రాజు, నాగరాజు, అక్బర్, అర్మాన్తో పాటు రామవరం ప్రాంతానికి చెందిన పలువురు పట్టభద్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

