ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి.. 2014 నుంచి ఇది నాలుగోసారన్న ఎంపీ
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయని తెలిపారు.
న్యూఢిల్లీ: ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయని తెలిపారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదని చెప్పారు. ఈమేరకు ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలోని తన నివాసంపై మరోసారి దాడి జరిగిందని, 2014 నుంచి ఇది నాలుగోసారని ట్వీట్ చేశారు. జైపూర్ పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీలోని ఇంటికి తిరిగివచ్చేసరికి దాడి జరిగింది. ఆగంతకులు రాళ్లు విసరడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయయి. సాయంత్రం 5.30 గంటలకు ఈ దాడి జరిగినట్లు తమ ఇంటి పనిమనిషి సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈఘటనపై ఢిల్లీ పోలీసులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు.
My Delhi residence has been attacked again. This is the fourth incident since 2014. Earlier tonight, I returned from Jaipur & was informed by my domestic help that a bunch of miscreants pelted stones that resulted in broken windows. @DelhiPolice must catch them immediately pic.twitter.com/vOkHl8IcNH
— Asaduddin Owaisi (@asadowaisi) February 19, 2023
Delhi | Residence of AIMIM chief Asaduddin Owaisi, at Ashoka road, was allegedly attacked by some unknown persons. A complaint was filed by Asaduddin Owaisi in this regard. Addl DCP visited his residence, police collecting the evidence. pic.twitter.com/82hKfxF6hI
— ANI (@ANI) February 19, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

