న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రత్యామ్నాయమని ఆ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లక్నోలో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రస్తుతం ఎంఐఎం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచిందన్నారు. బీఎస్పీ, ఎస్పీ అవకాశవాద పార్టీలని.. ఎన్నికల్లో గెలిచేందుకే ఆ పార్టీలు ముస్లింలను వాడుకున్నాయని ఆరోపించారు.
‘కొందరు ఏజెంట్లు ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా ముందుకు వస్తున్నారని, ముస్లింలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు’ అని ఆరోపించారు. ‘మేం గెలువమని నమ్ముకంటే.. మీరెందుకు భయపడుతున్నారు.. కబాబ్, బిర్యానీ తింటూ సంతోషంగా ఉండండి’ అంటూ అఖిలేశ్‌యాదవ్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. రాహుల్ గాంధీ గురించి నేనేం చెబుతా.. ‘సిద్ధూ కూడా పారిపోయాడు (సిద్ధు భీ చోడ్ కే చలా గయా) అంటూ వ్యాఖ్యానించారు.